Rachayitalasangham.com

అంతర్జాలంలో తెలుగు భాషాభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ రచయితల సంఘం - #తెలుగునువెలిగిద్దాం

 నమస్కారం,
                          ఆగష్టు 29న వ్యావహారిక భాషోద్యమ నాయకుడు గిడుగు రామ్మూర్తి జయంతిని తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకుంటున్న సంగతి మనందరికీ విదితమే. తెలుగు భాషాభివృద్దికి రచయితల సంఘం,ఆంధ్రప్రదేశ్ కూడా వివిధ మార్గాలు, కార్యక్రమాల ద్వారా తనవంతు పాటుపడుతోంది. నేడు ప్రజలు తమ భావాలను వ్యక్తపరచటానికి ఫేస్ బుక్, ట్విట్టర్ వంటి సామాజిక మాధ్యమాలను విరివిగా వాడుతున్నారు. కానీ అంతర్జాల ప్రజల భాష తెలుగుభాష అవలేదు. ఈ పరిణామంలో తెలుగు మాటల భాషగా మిగిలిపోకుండా ప్రజల భాషగా ముందు తరాలకు అందాలంటే మనమంతా సామాజిక మాధ్యమాల్లోనూ తెలుగులోనే రాద్దాము, అంతర్జాలంలో తెలుగు ఉనికిని చాటుదాము. ఈ సందర్భంగా రచయితల సంఘం, ఆంధ్రప్రదేశ్ ప్రతి తెలుగు వారికీ పిలుపునిస్తోంది అంతర్జాలంలో తెలుగులో రాయండి, రాయటం రాని వారికి నేర్పించండి. ఈ ఆగష్టు 29న తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా  అందరూ "#తెలుగునువెలిగిద్దాం” ట్యాగ్ ని వాడుతూ తెలుగు భాష తీయదనాన్ని, ఉన్నతిని చాటిచెప్పాలని కోరుకుంటున్నాం.
రచయితల సంఘం, ఆంధ్రప్రదేశ్


#తెలుగునువెలిగిద్దాం

(లేఖ చిత్ర రూపంలో) 

Share:

Follow in Twitter

Follow in Facebook

  • కార్యవర్గ సభ్యుల ట్వీట్లు

    అధ్యక్ష్యుడు: ...ప్రధాన కార్యదర్శి:

    Blog Archive